| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కాలె యాదయ్య

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కాలె యాదయ్య

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య భేటీ అయ్యారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కాలె యాదయ్య కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ను శాలువాతో సత్కరించారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. చేవెళ్లకు సీడీపీ నిధులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని ఇటీవల విన్నవించారు. ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు.

Previous జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం ఎదుట నిప్పంటించుకున్న యువకుడు
Next నార్సింగ్ మండలం పిఎసిఎస్ చైర్మన్ శంకర్ గౌడ్ గుండెపోటుతో మరణం
ADVERTISEMENT