| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దేవాలయాలు ధర్మ పరిరక్షణకు పాటుపడాలి : హరీష్ రావు

దేవాలయాలు ధర్మ పరిరక్షణకు పాటుపడాలి : హరీష్ రావు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్ గ్రామంలో శనివారం శ్రీ ఆంజనేయ స్వామివారి వైభవోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి ప్రతిష్టా మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఎంతో ఆశీర్వాదంగా భావిస్తున్నానని.. ఈ సందర్భంగా కొండకల్ గ్రామస్తులను కలవడం సంతోషంగా ఉందన్నారు హరీశ్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. ధర్మ పరిరక్షణకు ఆలయాలు అండగా నిలవాలన్నారు. పూర్ణాహుతి, అభిషేకం, అలంకరణ, మహానివేదనతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పండితులను సత్కరించి అన్నప్రసాద వితరణ చేశారు.

Previous బిజెపి లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Next మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్...కాలేజ్ కోసం వేసిన రోడ్డు తొలగింపు
ADVERTISEMENT