రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజుబకాయిలను చెల్లించాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కి వినతి...
ఫీజు బకాయిల పాపం బిఆర్ఎస్ ప్రభుత్వానిదే 5500 కోట్ల ఫీజు బకాయాలను విడుదల చేయాలి...
టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్...
డైలీ భారత్, వరంగల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 సంవత్సరాల కు సంబంధించిన ఇంజనీరింగ్ డిగ్రీ బి.ఎడ్ ప్రొఫెషనల్ కళాశాలకు సంబంధించిన 5500 కోట్ల పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేయాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కి వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని బంగారు తెలంగాణ పేరుతో పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను గత బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసినందుకుగాను తగిన మూల్యాన్ని చెల్లించుకోవడం జరిగిందని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 5500 కోట్ల పెండింగ్ ఫీజు బకాయిలు ఉండడం జరిగిందని,ఈ బకాయిల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు,లేకపోతే బడుగు బలహీన పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని అన్నారు.కళాశాలలో ఉన్న అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేక అద్దెలు కూడా కట్టలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు మోతే రాజిరెడ్డి, TNSF వరంగల్ ఇంచార్జీ ఇరుగు రవీందర్ పాల్గొనడం జరిగింది.