రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు దనసరి అనసూయ
డైలీ భారత్, కొత్తగూడ: ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి చేపడుతున్న పనులు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు దనసరి అనసూయ అధికారులను కోరారు.
శుక్రవారం కొత్తగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లాలోని మారుమూల ప్రాంతం ములుగు నియోజక వర్గంలో ఉన్న కొత్తగూడ, గంగారం మండలాల అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ మండల జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో త్రాగునీరు విద్య వైద్యం గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమం గ్రామీణ అభివృద్ధి విద్యుత్తు వంటి పలు శాఖల అధికారులతో పనితీరును సమగ్రంగా సమీక్షించారు
తొలుత త్రాగునీరు పై సమీక్షిస్తూ... కొత్తగూడ, గంగారం మండలాలలో తీవ్రమైన నీటి కొరత ఉంటుందన్నారు.
ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం ద్వారా త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతున్నదని వేసవిలో త్రాగునీటి కొరతను ఎదుర్కొనేందుకు గ్రామాలలో ప్రత్యామ్నాయ వనరులకు అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు.
విద్య పై సమీక్షిస్తూ మ్యాథ్స్ సైన్సు సబ్జెక్టులలో విద్యార్థులకు పట్టు సాధించేలా శిక్షణ ఇప్పించాలన్నారు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలన్నారు.
వైద్యంపై సమీక్షిస్తూ సి సెక్షన్స్ తగ్గించేందుకు వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని గర్భిణీ స్త్రీలకు అవగాహన పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు గిరిజన సంక్షేపం పై మాట్లాడుతూ విద్యార్థులకు సరిపోయే టాయిలెట్స్ నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ పంతీరుపై సమీక్షించారు అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు నర్సరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేశారు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ఉపాధి హామీ పనులు విస్తృత పరచాలని గ్రామపంచాయతీ భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు గిరి వికాస పథకంతో లబ్ధిదారులు అభివృద్ధి చెందేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
విద్యుత్ శాఖ పనితీరును సమీక్షిస్తూ...లో వోల్టేజి సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో డి ఆర్ డి ఓ పురుషోత్తం డిప్యూటీ సీఈవో నర్మద మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి విద్యుత్ శాఖ అధికారి నరేష్ పంచాయతీరాజ్ ఈ ఈ సురేష్ ఆర్ అండ్ బి ఈఈ తానేశ్వర్ డిడి ట్రైబల్ వెల్ఫేర్ ఎర్రయ్య పంచాయతీ అధికారి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.