| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ వలలో చిక్కిన విద్యుత్‌ శాఖ జూనియర్‌ అకౌంట్‌ అధికారి

ఏసీబీ వలలో చిక్కిన విద్యుత్‌ శాఖ జూనియర్‌ అకౌంట్‌ అధికారి

డైలీ భారత్, హబ్సిగూడ: విద్యుత్ శాఖలో జూనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడలోని (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌)లో జూనియర్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న విజయ నరసింహారెడ్డి అనే ఉద్యోగి రూ. 35,000, లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు అదే డిపార్ట్‌మెంట్‌లో ఆర్టిజన్‌గా పనిచేస్తున్న భరత్ బకాయిల కోసం జూనియర్ అకౌంటెంట్‌ను సంప్రదించగా విజయ నరసింహారెడ్డి డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, 01.03.2024 మధ్యాహ్నం హబ్సిగూడ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం తీసుకుంటుండగా ఏ.ఓ.ని పట్టుకున్నారు. ఏఓ నుంచి రూ.35 వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు

Previous మార్చి 4న బిజెపి నిర్వహించే సభకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
Next చరిత్రలో గుర్తిండి పోయేలా పనులు చేయాలి
ADVERTISEMENT