| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రెస్ అకాడమీ చైర్మన్ ను కలిసిన టియుడబ్ల్యూజె - ఐజెయు నాయకులు

ప్రెస్ అకాడమీ చైర్మన్ ను కలిసిన టియుడబ్ల్యూజె - ఐజెయు నాయకులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డిని గురువారం పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వికారాబాద్ టియుడబ్ల్యూజే(ఐజేయు) యూనియన్ జర్నలిస్ట్ నాయకులు గురువారం  మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లాలో నెలకొన్న జర్నలిస్ట్ ల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఇటీవల చౌడాపూర్ మండల సూర్య దినపత్రిక విలేఖరి ఉదయ్ శంకర్ గుండెపోటుతో మృతి చెందిన విషయం చైర్మన్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ప్రెస్ అకాడమి తరపున ఉదయ్ శంకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన స్పందిస్తూ మార్చి 5వ తేదీ తర్వాత ప్రెస్ అకాడమీ కార్యాలయానికి వస్తే అన్ని విషయాలు సమగ్రంగా చర్చించి తగిన న్యాయం చేద్దామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్, జిల్లా కోశాధికారి కె .రాఘవేందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

Previous రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అధికారులంతా సిద్దంగా ఉండాలి : జిల్లా ఎస్పీ డా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఐ.పి.యస్.
Next సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు
ADVERTISEMENT