| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అధికారులంతా సిద్దంగా ఉండాలి : జిల్లా ఎస్పీ డా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఐ.పి.యస్.

రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అధికారులంతా సిద్దంగా ఉండాలి : జిల్లా ఎస్పీ డా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఐ.పి.యస్.

మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ డా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఐ.పి.యస్.

క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా ఈ రోజు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీస్ అధికారులతో నెల వారి నేరసమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్ లో (అండర్ ఇన్వెస్టిగేషన్) ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, నేరస్తులను న్యాయస్థానం ముందు హాజరుపరచాలని యస్.హెచ్.ఒ. లకు సూచనలు చేశారు. NBWs ఎగ్జిక్యూషన్, మిస్సింగ్ కేసులలో ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ప్రతి కేసులో ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, UI కేసులు పరిమిత లిమిట్స్ లో ఉండాలని సూచించారు. వచ్చే నెల 9న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ నందు వీలైనన్నీ ఎక్కువ కేసులు పరిస్కారమయ్యే విధంగా చూడాలన్నారు.  యస్.హెచ్.ఒ. లు తమ, తమ ఏరియాలో సి.సి.కామెరాలు ఏర్పాటు చేసే విధంగా ఆయా గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.          

అనంతరం రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ ను దృష్టిలో ఉంచుకొని పోలీస్ అధికారులు, సిబ్బంది 24/7 అందుబాటులో ఉండాలని, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి ఎన్నికల కమిషన్ ఆధీనంలో విధులు నిర్వహించవలసి ఉంటుందన్నారు . సిబ్బంది ఎవ్వరూ కూడా విధినిర్వాహణలో అలసత్వం చూపరాదని, పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల నియమావళిని తెలుసుకొని వుండాలన్నారు. గత ఎన్నికలలో జరిగిన లోపాలను అధిగమించి, పకడ్బందీగా ఎన్నికలు నిర్వ హించుకునేల  అధికారులు అందరు కృషి చేయాలన్నారు. స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్, ఇతర జిల్లాలతో సరిహద్దు చెక్ పోస్ట్ లతో పాటు ఎస్.హెచ్.ఓ లు తమ తమ ఏరియాలలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టి ఎలాంటి అక్రమ రవాణాకు తావులేకుండా చూడాలని సూచించారు.  


ఈ సమీక్షా సమావేశంలో అదనపు.ఎస్పీ జోగుల చెన్నయ్య, ట్రైని ips పండరి చేతన్, మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు, తొర్రుర్ డిఎస్పీ సురేష్,తదితరులు పాల్గొన్నారు.

Previous శివాలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గోన్న పట్నం సునీత మహేందర్ రెడ్డి
Next ప్రెస్ అకాడమీ చైర్మన్ ను కలిసిన టియుడబ్ల్యూజె - ఐజెయు నాయకులు
ADVERTISEMENT