| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శివాలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గోన్న పట్నం సునీత మహేందర్ రెడ్డి

శివాలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గోన్న పట్నం సునీత మహేందర్ రెడ్డి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో  : చేవెళ్ల నియోజకవర్గం  నవాబు పేట మండలం లోని లింగంపల్లి గ్రామం లో నూతనంగా  భారీ స్థాయిలో నిర్మించిన శివాలయ ప్రతిష్ఠ మహోస్తవం దేవస్థానo లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వికారాబాద్ జిల్లా జెడ్పి ఛైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విశేష పూజా కార్యక్రమం లో  పట్నం సునీత మహేందర్ రెడ్డితో పాటు చేవెళ్ళ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జీ పామేన భీమ్ భరత్ పాల్గొన్నారు.స్వామి వారిని స్థానిక ప్రముఖులు, ప్రజల సమక్షంలో ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 

నేటి ఆధునిక యుగం లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న మనిషి జీవితానికి ఊరట నిచ్చేది భగవంతుని కృప మాత్రమే అని తెలిపారు, ప్రపంచ ప్రఖ్యాత , కలియుగ  శివాలయ ప్రారంభోత్సవం లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం తెలిపారు. ఇంతటి ప్రతిష్ట కలిగిన ఈ ఆలయ అభిృవృద్ధికి శాయశక్తులా అంకిత భావం తో కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. 

తన పై ప్రత్యేక ప్రేమ చూపించిన ఆలయ నిర్వాహకు లకు, గ్రామ ప్రజలకు ఆయన తన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు, 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.



ఈ కార్యక్రమం లో ఆలయ అర్చకులు  నవాబుపేట మండల పార్టీ అధ్యక్షులు మేడిపల్లి వెంకటయ్య బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ సామ వెంకటరెడ్డి చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భానూరి ఉపేందర్ రెడ్డి మీనే పల్లి మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి అర్కతల మాజీ సర్పంచ్ వడ్డె రాములు  మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయికుమార్ యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ శివ ప్రసాద్ మల్లేశం లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అద్యాక్సులు ,కార్యదర్శులు ,కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ,కార్యకర్తలు  స్థానిక ప్రజలు, భక్తులు, వెలాధిగా పాల్గొని విజయ వంతం చేశారు.

Previous తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అరుదైన గౌరవం
Next రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అధికారులంతా సిద్దంగా ఉండాలి : జిల్లా ఎస్పీ డా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఐ.పి.యస్.
ADVERTISEMENT