దశాబ్దాల నాటి సమస్యలకు పరిష్కారం చూపిన మన మోదీ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
దేశాన్ని అగ్రభాగంగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :రాజరాజేశ్వరీ క్లస్టర్ విజయ సంకల్ప బస్సు యాత్ర గురువారం చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలో
ముఖ్య అతిధులుగా వచ్చిన రాజ్యసభ సభ్యుల ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ , బిజెపి శాసన సభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి,మాజీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంధర్బంగా రాజ్యసభ సభ్యుల కె .లక్ష్మణ్ మాట్లాడుతు
దేశంలో ప్రదాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రాత్మకమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం బీజేపీ ఖాతాలో చేరే విధంగా ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వాదించాలని కోరారు. 500 సంవత్సరాల దేశ ప్రజల కల శ్రీరామ మందిర నిర్మాణం పూర్తి చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. మోదీని ఓడించాలని కుట్రలు పన్నుతున్న కుటుంబ పార్టీలకు ప్రజలు పార్లమెంట్ ఎన్నిక సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందన్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ
గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కోసం తొమ్మిది లక్షల కోట్ల పై చిలుకు నిధులు కేటాయించారని అన్నారు.
దేశం లో రైతులను, అణగారిన వర్గాలను, పేద ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని, కరోనా సమయం లో దేశం లో ప్రతీ ఒక్కరికి ఉచితంగా టీకాలు ఇచ్చారని, ఉచిత రేషన్ ఇచ్చారని అన్నారు.
ఆర్థిక రంగం లో భారతదేశం దూసుకుపోతుందని, మరో ఐదేళ్లలో 5వ స్థానం లో ఉన్న భారత్ ను 3వ స్థానం లోకి తీసుకురావడమే మోడీ లక్ష్యమని అన్నారు. చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగర వేసేం దుకు పార్టీ నాయకులు కృషి చేయాలన్నారు. చేవెళ్ల మీదుగా వెళ్లే హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపితే గత బీఆ ర్‌ఎస్ ప్రభుత్వం సక్రమంగా భూసేకరణ చేయలేదన్నారు. సమాజంలో మార్పు రావాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని అగ్రభాగంగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ప్రారంభమైన బిజెపి విజయ సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్చారని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్,కాంగ్రెస ప్రభుత్వాల పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గిందని,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీని కలిసి రాష్ర్టానికి తెచ్చిన నిధులను కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాలకు మాత్రమే ఇచ్చారన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, షాబాద్ బిజెపి మండల అధ్యక్షుడు కిరణ్‌కుమార్, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.