| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

షోకాజ్ నోటీసులపై గూడూరి రవీందర్ స్పందన... 100 డెలివరీలు చేసిన వైద్యుల కృషిని గుర్తించాలని విజ్ఞప్తి

షోకాజ్ నోటీసులపై గూడూరి రవీందర్ స్పందన... 100 డెలివరీలు చేసిన వైద్యుల కృషిని గుర్తించాలని విజ్ఞప్తి

డైలీ భారత్, సిరిసిల్ల: తనకు జారీ అయిన షోకాజ్ నోటీసుల నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ గూడూరి రవీందర్ స్పందించారు.

తాను సహా ప్రభుత్వ వైద్యులు ఒకే రోజు 9 డెలివరీలు, నెలలో 100 డెలివరీలు చేసి ప్రజలకు సేవలందించామని, అయితే ఇలాంటి సానుకూల అంశాలు వార్తల్లో రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై నెగెటివ్ వార్తలు రాస్తే నష్టం ప్రజలకే జరుగుతుందని, ప్రజల్లో ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకం సడలుతుందని పేర్కొన్నారు. వ్యక్తిగత విభేదాలు ఉంటే సంబంధిత వ్యక్తులపైనే వార్తలు రాయాలని, మొత్తం ప్రభుత్వ ఆసుపత్రి వ్యవస్థను మధ్యలోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు.

తన షోకాజ్ నోటీసులకు సంబంధించి తగిన వివరణ ఇస్తానని, తన వృత్తిపరమైన సేవలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

Previous భద్రాద్రిలో నాయి బ్రాహ్మణుల భారీ బైక్ ర్యాలీ...కలెక్టరేట్ ముట్టడి
Next భద్రాద్రిలో రూ.6.90 కోట్ల బియ్యం కుంభకోణం... 42 టన్నుల బియ్యం మాయం... CBI, ED విచారణకు BJP డిమాండ్
ADVERTISEMENT