డైలీ భారత్, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన అర్జునపూడి నవత కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న వసుధ ఫౌండేషన్ మానవతా దృక్పథంతో ఆమెకు అండగా నిలిచింది.
వైద్య చికిత్స నిమిత్తం రూ.10,000 ఆర్థిక సహాయాన్ని వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు ద్వారా ఉమ్మడి జిల్లా కన్వీనర్ వేగేశ్న శ్రీనివాస్ రాజు అందజేశారు.
భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ విద్య, వైద్యం రంగాల్లో విశేష సేవలందిస్తున్న వసుధ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని యువ నాయకులు కుంజా సంతోష్ పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయం అందిస్తూ కష్టకాలంలో భరోసా కల్పించడం గొప్ప మానవత్వానికి నిదర్శనమని, ఇలాంటి సేవలు మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అర్జునపూడి సక్కుబాయి, హరిబాబు, రాజేష్, సాయి కౌశిక్, సవలం వంశీ తదితరులు పాల్గొన్నారు.