| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భద్రాద్రిలో నాయి బ్రాహ్మణుల భారీ బైక్ ర్యాలీ...కలెక్టరేట్ ముట్టడి

భద్రాద్రిలో నాయి బ్రాహ్మణుల భారీ బైక్ ర్యాలీ...కలెక్టరేట్ ముట్టడి

BC-D నుండి BC-A లోకి ముదిరాజుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ధర్నా!

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం 500/82 జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుమారు 200 మంది హాజరై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.

బీసీ-డి వర్గంలోని ముదిరాజులను బీసీ-ఏ లో చేర్చే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నిరసన ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం 500/82 రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శీనన్న పిలుపు మేరకు, జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం 500/82 జిల్లా అధ్యక్షుడు కడియాల సత్యనారాయణ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జిల్లాలోని నాయి బ్రాహ్మణ సోదరసోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో హాజరై ధర్నా విజయవంతం చేశారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల, గ్రామాల నుండి నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

#NaiBrahmin #BhadradriKothagudem #CollectorateMuttadi #KadiyalaSatyanarayana #BCDtoBCA #DailyBharat

Previous రూ.6.91 కోట్ల బియ్యం దారి మళ్లింపు... ఆళ్ళ మురళి అరెస్టే లక్ష్యంగా కలెక్టరేట్ ముందు జైభీమ్ రావ్ భారత్ పార్టీ భారీ ధర్నా!
Next షోకాజ్ నోటీసులపై గూడూరి రవీందర్ స్పందన... 100 డెలివరీలు చేసిన వైద్యుల కృషిని గుర్తించాలని విజ్ఞప్తి
ADVERTISEMENT