డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి మరియు సిఐ ఎన్ శ్రీనివాస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యక్రమం యొక్క వివరాలు తెలుసుకుని ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఎంత మంది హాజరవుతారు, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే అంశాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వేడుకలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
పాత బస్టాండ్ నుంచి ర్యాలీ, సభా వేదిక వద్ద బందోబస్తు, పార్కింగ్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.