| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

21 రోజులుగా కొనసాగుతున్న NHM ఉద్యోగుల సమ్మెకు AMDR ఫౌండేషన్ మద్దతు.. క్రమబద్ధీకరణే డిమాండ్!

21 రోజులుగా కొనసాగుతున్న NHM ఉద్యోగుల సమ్మెకు AMDR ఫౌండేషన్ మద్దతు.. క్రమబద్ధీకరణే డిమాండ్!

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్యోగ భద్రత కల్పించి, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్ లో గత 21 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు ఏఎండిఆర్ ఫౌండేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

సోమవారం ఫౌండేషన్ ప్రతినిధి ఆదిల్ సమ్మె శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆదిల్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలందించిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు నేటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం విచారకరమన్నారు.

ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరించాలని, అప్పటివరకు వారికి ఏఎండిఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దలకు తమ ఫౌండేషన్ తరపున ఉద్యోగుల సమస్యలను తీసుకుని వెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్నారు.

#NHMStrike #BhadradriKothagudem #AMDRFoundation #JobSecurity #DailyBharat

Previous సిరిసిల్లలో ఫోక్ ఇండస్ట్రీ సందడి... తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు!
Next సిరిసిల్లలో ఫోక్ ఇండస్ట్రీ సభా ఏర్పాట్లను పరిశీలించిన DSP నాగేంద్ర చారి.. పోలీసు భద్రతా ఏర్పాట్లపై ఆరా!
ADVERTISEMENT