| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఖాకీలో మానవత్వం... సిరిసిల్ల పోలీసులకు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ప్రశంసలు

ఖాకీలో మానవత్వం... సిరిసిల్ల పోలీసులకు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ప్రశంసలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజల రక్షణే లక్ష్యంగా విధులు నిర్వహించడంతో పాటు, ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం కూడా పోలీసుల ప్రధాన బాధ్యత అని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు.

ఇటీవల ఎల్లారెడ్డిపేట మండలంలోని మొదటి బైపాస్ రోడ్డుపై ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలో పడిపోయిన మహిళకు తక్షణ సహాయం అందించి, మానవత్వం చాటుకున్న బ్లూకోట్ కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ చారిలకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రోత్సాహకాలు, ప్రశంసా పత్రాలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పోలీసుల విధులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచి, అవసరమైన సమయంలో తక్షణ సహాయం అందించడం కూడా పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది మానవత్వం, సేవాభావం, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు.

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ, సమయస్ఫూర్తితో స్పందించి ప్రజలకు మెరుగైన సేవలందించే సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

Previous కామారెడ్డి జిల్లాకు గర్వకారణం... తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సలహా కమిటీ మెంబర్‌గా Dr. M. జైపాల్ రెడ్డి నియామకం!
Next టేక్రియాల్ చెరువులో శుభ్రత పనులు వేగవంతం.. నిమజ్జన వ్యర్థాల తొలగింపునకు చైర్‌పర్సన్ ఆదేశం!
ADVERTISEMENT