| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి జిల్లాకు గర్వకారణం... తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సలహా కమిటీ మెంబర్‌గా Dr. M. జైపాల్ రెడ్డి నియామకం!

కామారెడ్డి జిల్లాకు గర్వకారణం... తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సలహా కమిటీ మెంబర్‌గా Dr. M. జైపాల్ రెడ్డి నియామకం!

డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ క్రీడా రంగంలో కామారెడ్డి జిల్లాకు మరో అరుదైన గౌరవం దక్కింది. స్థానిక RK గ్రూప్ CEO, ప్రముఖ విద్యావేత్త, కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ & కామారెడ్డి ఒలింపిక్ డే రన్ చైర్మన్ Dr. M. జైపాల్ రెడ్డిని తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమించింది.

అసలేం జరిగింది?

క్రీడా రంగంలో ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తిస్తూ ఒలింపిక్ అసోసియేషన్ ఈ కీలక బాధ్యతను అప్పగించింది. ఈ నియామకాన్ని తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి. మల్లారెడ్డి  అధికారికంగా నిర్ధారించారు.

ఈ అడ్వైజరీ కమిటీకి ప్రెసిడెంట్‌గా మాజీ MP జితేందర్ రెడ్డి  చైర్మన్‌గా, మాజీ మంత్రి వేణుగోపాల్ చారి  వైస్ చైర్మన్‌గా, మరియు డిప్యూటీ చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ బండ ప్రకాష్  కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక కమిటీలో కామారెడ్డి జిల్లా నుండి జైపాల్ రెడ్డి ఎంపిక కావడంపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికంగా హర్షాతిరేకం:

జైపాల్ రెడ్డి నియామకం పట్ల కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు, వివిధ క్రీడా సంఘాలు, వివిధ కళాశాలల అధ్యాపక బృందం, విద్యార్థులు, స్థానిక అథ్లెట్లు, క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా అభినందనలు తెలియజేశారు.

క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం - జైపాల్ రెడ్డి:

ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి  మాట్లాడుతూ... తనకు ఇంతటి బాధ్యతను అప్పగించినందుకు స్టేట్ ఒలింపిక్ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కామారెడ్డి జిల్లా క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో సముచిత స్థానం దక్కేలా కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి క్రీడా రంగంలో మంచి పేరు తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చదువుతో పాటు ఆటలను కూడా బ్యాలెన్స్ చేయాలని పిలుపునిచ్చారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం, ఆరోగ్యం, మానసిక ఉల్లాసం లభిస్తాయని, ప్రతిభ గల క్రీడాకారులకు తన సంపూర్ణ ప్రోత్సాహం ఉంటుందని స్పష్టం చేశారు.

Previous CCTV లో దొరికిపోయిన పోలీస్ డ్రామా... పరుపు కింద హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించిన ASI సస్పెండ్!
Next ఖాకీలో మానవత్వం... సిరిసిల్ల పోలీసులకు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ప్రశంసలు
ADVERTISEMENT