| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భద్రాద్రిలో రూ.6.90 కోట్ల బియ్యం కుంభకోణం... 42 టన్నుల బియ్యం మాయం... CBI, ED విచారణకు BJP డిమాండ్

భద్రాద్రిలో రూ.6.90 కోట్ల బియ్యం కుంభకోణం... 42 టన్నుల బియ్యం మాయం... CBI, ED విచారణకు BJP డిమాండ్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీజ ఇండస్ట్రీస్ లో జరిగిన భారీ బియ్యం అక్రమాలపై సీబీఐ, ఈడీ మరియు విజిలెన్స్ విభాగాలతో సమగ్ర విచారణ జరిపించాలని భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

42 MT బియ్యం పక్కదారి - రూ.6.90 కోట్ల లూటీ:

శ్రీజ ఇండస్ట్రీస్ కు కేటాయించిన 175 మెట్రిక్ టన్నుల బియ్యంలో దాదాపు 42 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమ మార్గంలో పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్ లో విక్రయించారని, 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే సుమారు రూ.6.90 కోట్ల ప్రజాధనం లూటీ అయిందని ఆరోపించారు. మిల్లు అధినేత ఆళ్ల మురళీకృష్ణ ప్రధాన బాధ్యత వహించాలని, రాజకీయ అండదండలు, ఒక ముఖ్య మంత్రికి అనుచరుడిగా ఉన్న వ్యక్తి అండతో అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు.

FIR దాచిపెట్టారని ఆరోపణ - పోలీసులు ఒత్తిడిలో?

ఘటనపై కేసు నమోదు చేశామని చెబుతున్న పోలీసులు మూడు రోజులైనా FIR కాపీని బయటపెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని, పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గడం సరికాదని అన్నారు.

మంత్రి పొంగులేటి పాత్రపై విచారణ జరపాలి:

ముగ్గురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనం వహిస్తున్నారని, ప్రజాపక్షమని చెప్పుకునే స్థానిక సీపీఐ ఎమ్మెల్యే, సీపీఐ జిల్లా కార్యదర్శి ఇంతటి భారీ అవినీతిపై ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాత్రపై, అధికారులపై జరుగుతున్న ఒత్తిళ్లపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

అక్రమాలకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని 25% పెనాల్టీతో సహా ప్రజాధనాన్ని రికవరీ చేయాలని, అక్రమ ఆస్తులను జప్తు చేయాలని, తనిఖీల్లో నిర్లక్ష్యం వహించిన సివిల్ సప్లై అధికారులను సస్పెండ్ చేయాలని, CBI, ED విచారణ జరిపి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. 

Previous షోకాజ్ నోటీసులపై గూడూరి రవీందర్ స్పందన... 100 డెలివరీలు చేసిన వైద్యుల కృషిని గుర్తించాలని విజ్ఞప్తి
Next భద్రాచలంలో మానవత్వం చాటిన వసుధ ఫౌండేషన్... కిడ్నీ బాధితురాలు అర్జునపూడి నవతకు రూ.10 వేల సాయం!
ADVERTISEMENT