| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అయ్యప్ప భక్తుల పట్ల వివక్ష: సెండ్ జోడ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ వివాదాస్పద నిర్ణయం

అయ్యప్ప భక్తుల పట్ల వివక్ష: సెండ్ జోడ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ వివాదాస్పద నిర్ణయం

డైలీ భారత్, వికారాబాద్:వికారాబాద్‌లోని సెండ్ జోడ్స్  పాఠశాలలో వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు అయ్యప్ప మాల ధరించి వచ్చిన విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.

మాల ధరించిన విద్యార్థులను పాఠశాలకు రావద్దని సూచించడమే కాకుండా, తరగతి గదిలో కూర్చోవడానికి వీల్లేదంటూ ప్రిన్సిపాల్ స్పష్టం చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

హిందూ సమాజం ఎంతో నిష్ఠతో ఆచరించే అయ్యప్ప స్వామి మాల పట్ల పాఠశాల యాజమాన్యం ఇలా ప్రవర్తించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

పాఠశాల ముందు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం(ABABS) ,VHPS,ABVP నాయకులు, నిరసన వ్యక్తం చేస్తూ యాజమాన్య తీరును నిరసించారు. విద్యార్థుల భావోద్వేగాలను, మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Previous భద్రాచలంలో మానవత్వం చాటిన వసుధ ఫౌండేషన్... కిడ్నీ బాధితురాలు అర్జునపూడి నవతకు రూ.10 వేల సాయం!
Next అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ పాదయాత్ర 12వ రోజు గుత్తికి చేరింది.
ADVERTISEMENT