| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ట్రూ-అప్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి... బీజేపీ నేత జూటూరు కీర్తిరెడ్డి

ట్రూ-అప్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి... బీజేపీ నేత జూటూరు కీర్తిరెడ్డి

డైలీ భారత్, హైదరాబాద్: ట్రూ-అప్ ఛార్జీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వాత పెడుతోందని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పి టోకరా:

200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్న కాంగ్రెస్, ఇప్పుడు ట్రూ-అప్ ఛార్జీల పేరుతో టోకరా వేస్తోందని ఆమె మండిపడ్డారు. నవంబర్ నుంచి తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి 50 పైసల చొప్పున ట్రూ-అప్ ఛార్జీలు విధించనున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు.

ప్రజల జేబులకు చిల్లు పెట్టడమేనా ప్రజాపాలన?

ఓవైపు ఎల్ నినో సమస్యతో నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు సతమతం అవుతుంటే, మరోవైపు విద్యుత్ బిల్లుల రూపంలో సామాన్యుడిపై అదనపు భారం మోపడం సరికాదన్నారు. ట్రూ-అప్ ఛార్జీల వసూలుకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించడాన్ని తప్పుబట్టారు.

2022-23, 2023-24 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పునరాలోచించుకోవాలి:

ఇప్పటికైనా ఈ ట్రూ-అప్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించే మార్గాలపై పునరాలోచించాలని సూచించారు. లేకపోతే విద్యుత్ వినియోగదారులకు మద్దతుగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ప్రజల జేబులకు చిల్లు పెట్టడమేనా ప్రజాపాలన అంటే? అని కీర్తిరెడ్డి ప్రశ్నించారు.


Previous ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి
ADVERTISEMENT