| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సేవలు అద్భుతం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సేవలు అద్భుతం :  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆధ్వర్యంలో వృద్ధులకు చేయూత

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : షాద్ నగర్ పట్టణం కేంద్రంగా నడపబడుతున్న ఎఫ్. సి.ఎన్. హోమ్ లో  గురువారం ఫిబ్రవరి 22న చుట్టుపక్కల 20 గ్రామాల నుండి వచ్చిన 400 మంది వృద్ధులకు ఎఫ్.సి.ఎన్. వ్యవస్థాపకులైన డాక్టర్ గీత, తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు సుమారు1500 రూపాయల విలువైన దుస్తులు, దుప్పటి, టవల్,  గొడుగు, స్టీల్ వాటర్ బాటిల్ అందజేశారు. ఈ కార్యక్రమానికి షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ హాజరై డాక్టర్. గీత,తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు ఈ ప్రాంతంలో పేదలకు చేసే సహాయాన్ని కొనియాడుతూ ఎఫ్.సి.ఎన్ సేవలు అద్భుతం అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే స్ఫూర్తితో తన వంతు సహాయంగా వృద్ధులకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున  400 మందికి రెండు లక్షల రూపాయల చెక్కును సంస్థకు అందజేయడం జరిగింది. ఎఫ్. సి. ఎన్. వ్యవస్థాపకులు డాక్టర్.గీత, తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు మాట్లాడుతూ కుల మత రాజకీయాల కు అతీతంగా సేవలందిస్తున్నామన్నారు. వారికి బహుమతిని అందజేసినప్పుడు ఆ చిరునవ్వులో కనపడే ఆనందం మాకు సంతృప్తిని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి,కాంగ్రెస సీనియర్ నాయకులు అనంతం,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Previous పాలమూరు క్రికెట్ టోర్నమెంట్ లో సెమీఫైనల్ కి చేరుకున్న గని పికేపి జట్టు
Next వైఎస్ ష‌ర్మిల అరెస్ట్
ADVERTISEMENT