డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : పాలమూరు పట్టణంలోని నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పాలమూరు క్రికెట్ టోర్నమెంట్ హోరా హోరీగా కొనసాగుతుంది. గురువారం అరుణ్ రైల్వే ,గని పికెపి జట్ల మధ్య మ్యాచ్ హోరా హోరీగా నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి.అరుణ్ రైల్వే జట్టు పై గని పికెపి జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో అత్యధిక వికెట్లు తీసిన శ్రీనివాస్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది..ఈ మ్యాచ్ గెలుపుతో గని పికేపి జట్టు సెమీఫైనల్ కు చేరుకుంది.నిర్వాహకులు చక్రధర్ ,గిరిధర్, గని పికేపి టీమ్ స్పాన్సర్ గడ్డం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
News
పాలమూరు క్రికెట్ టోర్నమెంట్ లో సెమీఫైనల్ కి చేరుకున్న గని పికేపి జట్టు