డైలీ భారత్, మహబూబాబాద్: రాబోయే పార్లమెంటు ఎన్నికలకు అధికారులకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ ఆదేశించారు.
మంగళవారం సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయ సమావేశ మందిరంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల విధులపై అదనపు ఎస్పీ చెన్నయ్య తో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ...
గతంలో అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు నిబద్దతతో పని చేశారని, అదేవిధంగా రానున్న పార్లమెంటు ఎన్నికలలో కూడా అధికారులు అంకితభావంతో పని చెయ్యాలని కోరారు. ఎన్నికలకు ముందస్తుగా సిబ్బందిని సిద్ధం చేసుకోవాలన్నారు. అధికారులకు కేటాయించిన విధులు కాపీని అందజేయడం జరిగిందని అందుకు సంసిద్ధులై ఉండాలన్నారు. ప్రతి ఒక్కరికి వారి నిర్వహణ విధులను తెలియచేస్తూ సెలవులకు అనుమతి లేదని గ్రహించాలన్నారు. అడిషనల్ ఎస్పీ చెన్నయ్య మాట్లాడుతూ పోలీస్ అధికారుల సహకారం ఉంటుందని సమన్వయంతో విధులను నిర్వహించాలన్నారు. ఫిబ్రవరి 19 నుండి 25 వ తేదీ వరకు స్వీప్ కార్యక్రమాలు చేపడుతున్నందున సంబంధిత శాఖల అధికారులు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పి సిఈఓ రమాదేవి, డిఆర్ డిఏ పిడి పురుషోత్తం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.