| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చెరువులను ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

చెరువులను ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

డైలీ భారత్, మహబూబాబాద్: చెరువులు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని నిజాం చెరువు, గోపాలపురం, బంధం చెరువు, కంబాల చెరువులను అదనపు కలెక్టర్ లు లెనిన్ వత్సల్ టొప్పో , డేవిడ్, నీటిపారుదల, మున్సిపాలిటీ, రెవిన్యూ శాఖల అధికారులతో  కలిసి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్  సందర్శించి పర్యవేక్షించారు.

గోపాలపురం వద్ద కలెక్టర్ గృహ నివాసితులతో మాట్లాడారు. కంబాలపల్లి, బంధం చెరువు లకు ఎఫ్.టి.ఎల్. ఫిక్స్ చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ... చెరువులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, నిజం చెరువు కు ఎఫ్.టి.ఎల్. ఫిక్స్ చేయాలని నీటిపారుదల, రెవిన్యూ, మున్సిపల్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టర్ వెంట నీటిపారుదల శాఖ అధికారి సమ్మిరెడ్డి, ఏ.డి.సర్వేయర్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ నర్సింహ మూర్తి, మున్సిపల్ కమిషనర్ రవీందర్, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, మున్సిపల్ డీఈ. ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Previous రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
Next పార్లమెంట్ ఎన్నికలకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ డేవిడ్
ADVERTISEMENT