డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలిసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి . ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని వారి నివాసంలో గడ్డం ప్రసాద్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రసాద్‌కుమార్‌ను శాలువాతో సత్కరించి పూల మొక్కను బహూకరించి, అనంతరం జిల్లా అభివృద్ధిపై స్పీకర్‌తో కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందన్నారు.
News