| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రజలు పుకార్లు నమ్మవద్దు : రాహుల్ హెగ్డే ఐపిఎస్

ప్రజలు పుకార్లు నమ్మవద్దు : రాహుల్ హెగ్డే ఐపిఎస్


అనుమానిత వ్యక్తుల సమాచారం పోలీసు వారికి తెలపాలి.

పిల్లలను కిడ్నాప్ చేసే వారు అంటూ దాడులు చేయొద్దు.

రాహుల్ హెగ్డే ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

డైలీ భారత్, సూర్యాపేట జిల్లా: పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ లు తిరుగుతున్నాయి అని కొద్ది రోజులుగా పుకార్లు వస్తున్నాయి, ఇలాటివి ప్రజలు నమ్మవద్దు, ఇది పుకారు మాత్రమే, దీనిలో వాస్తవం లేదు, జిల్లా పోలీసు పటిష్ట నిఘా ఉంచినది అని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తోగరాయి గ్రామంలో ప్రజలు అనుమానంతో ఒక వ్యక్తిపై దాడి చేసి పట్టుకుని పోలీసు వారికి అప్పగించారు, కోదాడ రూరల్ పోలీసు వారు ఘటన స్థలానికి చేరుకుని అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా  అతని మానసిక స్థితి సరిగాలేదు అని తెలిసినది. పుకార్లు సృష్టించి ప్రజల్లో భయాందోళనలు కలిగించవద్దు అని ఎస్పి కోరినారు.

ప్రజలు, తల్లిదండ్రులు పుకార్లను నమ్మవద్దు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు అధికారులకు, డయల్ 100 కు, సూర్యాపేట జిల్లా పోలీసు స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ నంబర్ 8712686026 తెలపాలని ఎస్పి విజ్ఞప్తి చేసినారు. అనుమానంతో ఎవ్వరిపై కూడా భౌతిక దాడులకు పాల్పడవద్దు అని ఎస్పి కోరినారు.

Previous అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
Next బర్డ్ ప్లూ పంజా : మూడు నెలల పాటు ప్రజలు చికెన్ తినకపోవడమే మంచిదని సూచన
ADVERTISEMENT