| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

BTF 2024 క్యాలెండర్ ఆవిష్కరణ

BTF 2024 క్యాలెండర్ ఆవిష్కరణ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:శుక్రవారం రోజున బహుజన ఉపాధ్యాయ సంఘం సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ గౌరవ జిల్లా విద్యాధికారి రమేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము రమేష్  హాజరై మాట్లాడుతూ మిగిలిపోయిన పోస్టులకు త్వరలో డీఎస్సీ నియామకం చేపట్టాలని అగిన బదిలీలు షెడ్యూల్ను వేసవి సెలవుల్లో కొనసాగించాలని 317 G.O బాధితులకు న్యాయం చేయాలని త్వరలో ఎస్ఎస్సి పరీక్ష రాయబోతున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రాలలో మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే వారు కోరుకున్న పాఠశాలలకు లాస్ట్ వర్కింగ్ డే రోజు రిలీవ్ చేయాలని వారి ప్లేస్ లో ప్రమోషన్ బదిలీలు చేపట్టి పాఠశాలలో అన్ని సబ్జెక్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని లేదా ఖాళీగా ఉన్నట్లయితే వెంటనే విద్య వాలంటీర్లను నియమించాలని కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ పే 48 వేల రూపాయలు చెల్లించాలని మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కేర్ టేకర్లను నియమించాలని వెంటనే వారి బదిలీ షెడ్యూల్ను ప్రకటించి వారికి కూడా తగిన న్యాయం చేయాలని సూచించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కుమ్మరి మల్లేశం గారు జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు వసతి గృహాలలో ఉంటున్నారో ఆ వసతి గృహాలను సందర్శించి వారికి ఏ లోటు లేకుండా తగిన వసతులు కల్పించడంలో DEO చొరవ చూపాలని కోరడం జరిగింది తప్పకుండా వెళ్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ మంజూరు చేస్తున్నది కాబట్టి అప్లై చేసుకొని పాఠశాలలకు వెంటనే హెడ్మాస్టర్ల ద్వారా సంపూర్ణంగా అప్లై చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. DEO జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏ సమస్య అయినా తమ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అనంతరం ఇట్టి కార్యక్రమంలో బెజగం రమేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మానుపాటి రాజయ్య గారు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, కర్రోల్ల రాజలింగం సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి, సంఘ నాయకులు బావికాడి రామచంద్రం, దీకొండ విజయ్ కుమార్ స్వప్న, నేరెళ్ల బాబు, వడ్లురి ఆంజనేయులు, బడుగు మధుసూదన్, ఎల్లవేణి రమేష్, కుంట విశ్వనాథ్, ఆంజనేయులు ఎల్లారెడ్డిపేట, తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.

Previous జాతరలో విస్తృత వైద్య సేవలు :: పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
Next GSLVF14 ప్రయోగం విజయవంతం : ఇస్రో ఛైర్మన్‌ S సోమనాథ్‌
ADVERTISEMENT