| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జాతరలో విస్తృత వైద్య సేవలు :: పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

జాతరలో విస్తృత వైద్య సేవలు  :: పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

జాతర లో ఫుడ్ పాయిజన్ కాకుండా చూడాలి :: హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా 

అత్యధికంగా 40 బైక్ అంబులెన్స్ ఏర్పాటు :: హెల్త్ డైరెక్టర్ ఆర్ వి కర్ణన్

డైలీ భారత్, ములుగు జిల్లా: శనివారం మేడారం హరిత హోటల్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా ఐఏఎస్ , హెల్త్ డైరెక్టర్ ఆర్ వి కర్ణన్ ప్రత్యేక సమీక్ష సమావేశం  ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి అనసూయ సీతక్క హాజరయ్యారు.    

ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారం జాతరలో భక్తులకు విస్తృత వైద్య సేవలు అందించాలని భక్తుల రద్దీ పెరుగుతున్నా దృష్ట్యా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని అన్నారు. వైద్యులు దేవుడి తో సమానం అని అమ్మ జన్మిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారని జాతర లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో ఉండాలని అన్నారు.

హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ క్రిస్టినా ఐఏఎస్ మాట్లాడుతూ జాతర లో ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ కాకుండా చూడాలని ఫుడ్ సేఫ్టీ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని  జాతరలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులు భక్తులకు తెలిసే విధంగా సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. గద్దెల ప్రాంగణం లో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం లో 24/7 వైద్య సేవలు అందించాలని మెడిసిన్ కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు.

హెల్త్ డైరెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ 40 జి వి కే అంబులెన్సు సేవలు భక్తులకు నిరంతరం అందుబాటులో ఉంటాయని తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నిరంతరం వైద్య సిబ్బంది ఉండే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జంపన్న వాగు  పరిసర ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు ఉండేలా చూడాలని ఎండలు తీవ్రంగా ఉన్నా నేపథ్యం లో క్యూ లైన్ లో ఉండే భక్తులకు ఓ ఆర్ ఎస్ అందించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ , జిల్లా వైద్య అధికారి డాక్టర్ అలేం అప్పయ్య , సామాజిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ జగదీష్ , ఏటూరు నాగారం ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ సురేష్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Previous క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య
Next BTF 2024 క్యాలెండర్ ఆవిష్కరణ
ADVERTISEMENT