| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

డైలీ భారత్, కీసర: మేడ్చల్‌ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..

కీసర గ్రామానికి చెందిన సురేశ్‌ కుమార్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల అప్పుల భారం ఎక్కువ కావడంతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పిల్లలను బంధువుల ఇంటికి పంపించి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


#Crime

Previous మానవత్వాన్ని చాటుకున్న నర్సింహులపేట ఎస్సై గండ్రాతి సతీష్
Next జాతరలో విస్తృత వైద్య సేవలు :: పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
ADVERTISEMENT