| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్దే నా ధ్యేయం : గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్దే నా ధ్యేయం : గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క

-నన్ను గెలిపించిన ములుగు నేను ఇంఛార్జి గా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలు నాకు రెండు కళ్ళు 

-నాగోబా జాతర లో నిర్వహించిన దర్బార్ కార్యక్రమానికి హాజరై వినతులు స్వీకరించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

డైలీ భారత్, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి: నాగోబా జాతరలో భాగంగా కేస్లాపూర్‌లోని ఆలయంలో నేడు జరిగిన  ఆదివాసి  దర్బార్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క 

ఈ సందర్భంగా మాట్లాడుతూ 

జాతరలో భాగంగా నిర్వహించే దర్బార్‌కు ప్రత్యేక చరిత్ర ఉందని  జల్‌.. జంగల్‌.. జమీన్‌ నినాదంతో నిజాం సర్కార్‌తో పోరాడిన కుమురంభీం 1940లో అమరుడయ్యారు. భీమ్‌ పోరాటానికి ఉలిక్కిపడ్డ నిజాం సర్కార్‌ ఆదివాసీ గిరిజనుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు ప్రొఫెసర్‌ హైమాన్‌డార్ఫ్‌ను ఇక్కడికి పంపించింది అని ఆనాటి నుండి ఈనాటి వరకు నాగోబా జాతర లో ఆనవాయితీగా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని మంత్రి  అన్నారు వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా పాలన ఉంటుంది అని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని నన్ను ఆదరించి అక్కున చేర్చుకొని ములుగు నియోజకవర్గానికి నేను ఇంచర్జిగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా లు నాకు రెండు కండ్లు అని ఈ రెండు జిల్లాల ను అభివృద్ధి పథంలో నడిపేందుకు నా శక్తి వంచన లేకుండా పని చేస్తానని మంత్రి సీతక్క  అన్నారు ఈ దర్బార్ లో నా దృష్టికి తీసుకు వచ్చిన అన్ని సమస్యలు ముఖ్య మంత్రి గారి దృష్టికి తీసుకు పోయి పరిష్కారం అయే విధంగా చూస్తానని మంత్రి  అన్నారు 

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బోజ్జూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,పిఓ ఖుష్బూ గుప్త,తో పాటు తదితరులు పాల్గొన్నారు

Previous నేడు నామినేషన్ దాఖలు చేసిన వైసిపి రాజ్యసభ అభ్యర్థులు
Next హుజురాబాద్ లో మున్సిపల్ కార్మికుల ధర్నా
ADVERTISEMENT