ఇందిరమ్మ కాలనీ వయోవృద్ధుల ఆశ్రమంలో సేవా కార్యక్రమం!
తండ్రి జ్ఞాపకార్థం కుమారుడు నిర్వహించిన మానవతా కార్యక్రమం!
వృద్ధుల ముఖంలో చిరునవ్వే అసలైన సంతోషం: నిర్వాహకులు!
ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు!
డైలీ భారత్, తంగళ్లపల్లి:తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ గ్రామంలో ఉన్న ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలో చలికాలం సందర్భంగా వృద్ధులకు చలి దుప్పట్లు మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
తంగళ్లపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు సామలేటి భూమాలింగం జ్ఞాపకార్థంగా, ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారి కుమారుడు సామలేటి రాజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వృద్ధులతో మాట్లాడుతూ, వారు మనకు ఎంతో చేసిన త్యాగమూర్తులని, వారిని గౌరవించడం, ఆదరించడం మనందరి బాధ్యత అని నిర్వాహకులు అన్నారు. వయసు మీద పడిన తర్వాత తల్లిదండ్రులను, పెద్దలను ఒంటరిగా వదిలేయకుండా, వారికి ప్రేమ, ఆప్యాయత, ఆరోగ్యం అందించాలని పిలుపునిచ్చారు.
చలికాలంలో వృద్ధులు చలికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ దుప్పట్ల పంపిణీ చేపట్టామని, వారి ఆరోగ్యం కోసం పండ్లు అందించామని తెలిపారు. వృద్ధుల ముఖంలో చిరునవ్వు చూడటమే తమకు అసలైన సంతోషమని అన్నారు.
ఫ్రెండ్స్ క్లబ్ కేవలం ఈ ఒక్క కార్యక్రమానికే పరిమితం కాకుండా, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. గతంలో కూడా పేద విద్యార్థులకు పుస్తకాలు, పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని క్లబ్ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు ఎడమల శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు అంకారపు బాలహంస, ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, సహాయ కార్యదర్శి మచ్చ శ్రీనివాస్, కోశాధికారి గొల్లపల్లి మల్లేశం గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు శ్రీనివాసరెడ్డి, తంగళ్లపల్లి గ్రామ సర్పంచ్ మోర లక్ష్మీ రాజం, ఇందిరమ్మ కాలనీ గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ (చోటు), క్లబ్ మాజీ అధ్యక్షులు ఎడమల హనుమంత రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాసు గౌడ్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జలగం ప్రవీణ్ కుమార్ (టోనీ), సుద్దాల శ్రీనివాస్ గౌడ్, సామల గణేష్ తో పాటు క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
#DailyBharath #Sircilla