డైలీ భారత్, కామారెడ్డి: రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో కాకతీయనగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల సౌకర్యార్థం సీలింగ్ ఫ్యాన్లను పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్ఎంసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ అతిథిగా 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత హాజరయ్యారు.
ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు సబ్బని కృష్ణ హరి మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా విద్యార్థులు, చిన్నారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు మెరుగైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఫ్యాన్లను అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ఫ్యాన్లను స్పాన్సర్ చేసిన రోటేరియన్ మోటూరి భైరయ్యకు క్లబ్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు సబ్బని కృష్ణ హరి, కార్యదర్శి సోమిశెట్టి సంతోష్ కుమార్, మాజీ అధ్యక్షులు యాచం శంకర్, రమణ, క్లబ్ సీనియర్ అధ్యక్షులు, సీనియర్ కార్యదర్శులు, ఇతర రోటరీ సభ్యులు పాల్గొన్నారు.
సమాజ సేవే లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతుందని క్లబ్ ప్రతినిధులు తెలిపారు.
#DailyBharath #RotaryClub #Kamareddy