| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

37 రోజుల మహా పాదయాత్ర పూర్తి! పెద్ద పాదం మార్గాన సన్నిధానం చేరుకోనున్న ABABS బృందం!

37 రోజుల మహా పాదయాత్ర పూర్తి! పెద్ద పాదం మార్గాన సన్నిధానం చేరుకోనున్న ABABS బృందం!

డైలీ భారత్, పతనంతిట్ట: పెద్ద పాదం మార్గాన సన్నిధానం చేరుకోనున్న అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం ABABS శబరిమల మహా పాదయాత్ర బృందం.

అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కుచూరి సంజయ్ గురుస్వామి గత నెల 23న సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి చేపట్టిన శబరిమల మహా పాదయాత్ర 37వ రోజు పెద్ద పాద మార్గం నుంచి పులిమేడు మీదుగా ఈరోజు సాయంత్రానికి శబరిమల సన్నిధానానికి చేరుకోనున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కుచూరి సంజయ్ గురుస్వామి మాట్లాడుతూ 37 రోజులపాటు తన యాత్ర సాగిందని, ఈరోజు రాత్రికి శబరిమల సన్నిధానానికి చేరుకొని ఆ శ్రీధర్మశాస్తాను దర్శించుకోబోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పాదయాత్ర ద్వారా శబరిమలకు చేరుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

#DailyBharath #ABABS #Sabarimala #Ayyappa #Padayatra

Previous ఎల్లారెడ్డిపేట డిగ్రీ కళాశాలను కాపాడిన కవితక్క! చిత్రపటానికి పాలాభిషేకం!
Next కామారెడ్డిలో రోటరీ క్లబ్ సేవ! అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ల పంపిణీ!
ADVERTISEMENT