డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఫీజు కట్టి కాపాడిన టిఆర్ఎస్ అధినేత కవితక్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుర్తింపు, ఇతర ఫీజులు చెల్లించేందుకు చివరి తేదీ ఉన్నా ప్రజా ప్రతినిధులు, నాయకులు ఫీజు కట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో స్థానిక నాయకులు ఈ విషయాన్ని సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ మజీద్ దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామీణ ప్రాంత పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. శాతవాహన యూనివర్సిటీకి చెల్లించాల్సిన ఫీజు బకాయిలు చెల్లించలేని పరిస్థితి నెలకొనడంతో కళాశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఫీజు కట్టడం చివరి రోజు ఉందని, లేకపోతే కళాశాల రద్దవుతుందని కళాశాల పరిరక్షణ సభ్యుడు రంజిత్ సమస్య పరిష్కారం కోసం టిఆర్ఎస్ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ మజీద్ దృష్టికి తీసుకెళ్లారు.
మజీద్ ఈ సమస్యను టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన కవితక్క శాతవాహన యూనివర్సిటీకి చెల్లించాల్సిన రూ.1,30,800 మొత్తాన్ని చెల్లించి కళాశాలకు అండగా నిలిచి విద్యార్థుల భవిష్యత్తును కాపాడారు.
శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కదిరే భాస్కర్ గౌడ్, యూత్ నియోజకవర్గ నాయకుడు జావీద్, సాయి ప్రేమ్, రుద్రమదేవి సేన నియోజకవర్గ ఇంచార్జి కదిరే రేణుక ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందించే ప్రభుత్వ కళాశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సమయానికి అందిన ఈ ఆర్థిక సహాయం కళాశాలకు ఊరటనివ్వడమే కాకుండా విద్యార్థుల చదువులకు భరోసానిచ్చిందన్నారు. ఈ కళాశాలను కాపాడుకోవడానికి పార్టీలకతీతంగా అందరూ ముందుకు రావాలని, విద్యార్థులను, తల్లిదండ్రులను ఒప్పించి వచ్చే సంవత్సరం నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులను చేర్పించే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#DailyBharath #Kavithakka #Yellareddypet #Sircilla