| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అడవి పంది మాంసం కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తుల పట్టివేత! భద్రాద్రి కొత్తగూడెంలో అటవీ శాఖ సంచలనం!

అడవి పంది మాంసం కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తుల పట్టివేత! భద్రాద్రి కొత్తగూడెంలో అటవీ శాఖ సంచలనం!

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట అటవీ రేంజ్ పరిధిలోని తిరుమలకుంట బీట్ లో అడవి పందిని వేటాడి దాని మాంసాన్ని కలిగి ఉన్నారనే సమాచారం అటవీ శాఖ అధికారులకు అందింది!

వెంటనే అటవీ శాఖ సిబ్బంది మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో తిరుమలకుంట గ్రామానికి చెందిన కారం రాంబాబు వ్యవసాయ భూమిలో తనిఖీలు నిర్వహించారు! తనిఖీల్లో సుమారు 1.5 కిలోల అడవి పంది మాంసంతో ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు!

పట్టుబడిన వారి వివరాలు:

1. కారం రాంబాబు - తిరుమలకుంట

2. మోదియం వెంకటేష్ - కోర్సగూడెం

3. మడకం ముత్యాలరావు - బోరియాలగుట్ట

విచారణలో వారు తెలిపిన వివరాల ప్రకారం, కారం రాంబాబుకు చెందిన వ్యవసాయ భూమిలోకి అడవి పంది ప్రవేశించగా, అతని పెంపుడు కుక్కలు దానిని తరిమి చంపినట్లు తెలిపారు! అనంతరం కుక్కలు కొంత మాంసాన్ని తినగా, మిగిలిన మాంసాన్ని ముగ్గురు వ్యక్తులు పంచుకున్నట్లు విచారణలో వెల్లడించారు!

ఈ సంఘటనకు సంబంధించి అటవీ శాఖ అధికారులు సుమారు 1.5 కిలోల అడవి పంది మాంసాన్ని స్వాధీనం చేసుకొని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు! వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం అటవీ నేర కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు!

ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, అడవి జంతువులను వేటాడటం, చంపడం, వాటి మాంసాన్ని కలిగి ఉండటం, రవాణా చేయడం లేదా వినియోగించడం చట్టరీత్యా నేరమని తెలియజేశారు!

వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ హెచ్చరించింది! వన్యప్రాణులకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలు గుర్తించినట్లయితే వెంటనే సమీప అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరింది!

#DailyBharath #BhadradriKothagudem #Dummapet #ForestDepartment #WildBoar #Telangana

Previous ఏసీబీకి చిక్కిన టీజీఎస్పీడీసీఎల్ ఏడీఈ
ADVERTISEMENT