| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పరువు పోతుందని కన్నకూతురినే కడతేర్చిన తండ్రి!

పరువు పోతుందని కన్నకూతురినే కడతేర్చిన తండ్రి!

ఆత్మహత్యగా చిత్రీకరించి హడావుడిగా అంత్యక్రియలు!

డైలీ భారత్, ఆదిలాబాద్: కుటుంబ పరువు పోతుందని భావించిన కైలాస్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

నిశ్చితార్థానికి ముందు రోజు రాత్రి కళ్యాణిని తండ్రి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని మరో గదిలోకి తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడని పోలీసులు భావిస్తున్నారు.

మూడు గంటల్లోనే అంత్యక్రియలు:

మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయంలో తల్లి సుమిత్ర తన కూతురు ఉరేసుకుని ఉండటాన్ని చూసి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. కూతురు ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులను, గ్రామస్తులను నమ్మించిన కైలాస్, కేవలం మూడు నాలుగు గంటల్లోనే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేశాడు.

పోలీసుల ఎంట్రీతో బయటపడ్డ గుట్టు:

సంప్రదాయాలకు విరుద్ధంగా, బంధువులకు సమాచారం ఇవ్వకుండా అంత త్వరగా అంత్యక్రియలు నిర్వహించడంపై స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు నార్నూర్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, తండ్రి కైలాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో పరువు పోతుందనే భయంతో తానే కూతురిని చంపినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

#DailyBharath #Adilabad #Narnoor #HonorKilling #BreakingNews #Telangana

Previous నిరుపేద ఆదివాసి గ్రామం చెంచుపల్లిలో మానవ హక్కులు, అవినీతి నిరోధక అవగాహన సదస్సు!
Next మార్నింగ్ వాక్ కు వెళ్లిన బీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం! కళ్లలో కారం చల్లి విచక్షణారహితంగా దాడి!
ADVERTISEMENT