డైలీ భారత్, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని నిరుపేద గ్రామమైన చెంచుపల్లి గ్రామంలో హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కులు, అవినీతి నిరోధక చట్టాలు, ప్రజల హక్కులు, గ్రామాభివృద్ధి, విద్య, వైద్య సేవలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రత్యేక అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు!
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రాము, పంచాయతీ కార్యదర్శి నరేష్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని విధాలా సహకరించారు! సదస్సులో గ్రామ ప్రజలు తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర సమస్యలను నాయకుల దృష్టికి తీసుకురాగా, వాటిపై సమగ్రంగా చర్చించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు!
ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ నేషనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గుండా శ్రీనివాస్, నేషనల్ సెక్రటరీ బండి నారాయణ రెడ్డి, నేషనల్ సంయుక్త కార్యదర్శి మల్లం రాజ్ కుమార్, సౌత్ ఇండియా జాయింట్ సెక్రటరీ గొర్రె రమేష్, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ ఎన్. సంజీవ రాజు, తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ కొమ్ము రాజేష్, తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గుండా సుధాకర్, భూపాలపల్లి జిల్లా చైర్మన్ ఎం. రాజు బాబు, పారునంది సురేందర్, లీగల్ అడ్వైజర్ వరంగల్ జిల్లా చైర్మన్ మామిడాల సుధాకర్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ, వరంగల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రవ్వ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నా తమ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు!
మానవ హక్కుల పరిరక్షణ, అవినీతి నిర్మూలన, సామాజిక న్యాయం, విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సంస్థ నిరంతరం కట్టుబడి ఉంటుందని, అవసరమైన ప్రతి సందర్భంలో చట్టపరమైన సలహాలు, పరిపాలనా సహాయం అందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేస్తామని నాయకులు స్పష్టం చేశారు! గ్రామస్థులు తమ సమస్యలను ఓపికగా ఆలకించి స్పందించిన సంస్థ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు!
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, ప్రజాప్రతినిధులు, సంఘ సభ్యులు, హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు!
#DailyBharath #Bhupalpally #Regonda #Chenchupalli #HumanRights #AntiCorruption #Telangana