కామారెడ్డిలో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం! పేదల సొంతింటి కల సాకారం!
డైలీ భారత్, కామారెడ్డి:చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారురాలు వడ్ల సౌజన్య ఇంటి నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్దేశించిన నిర్మాణ నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలు, పునాదులు, గోడలు, బీమ్‌లు, స్లాబ్ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నాణ్యమైన సామగ్రిని ఉపయోగించి, సాంకేతిక సూచనలు పాటిస్తూ ఇంటి నిర్మాణాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేసుకోవాలని సూచించారు.
హాజరైన ప్రముఖులు:
గ్రామ సర్పంచ్ భీమయాల లక్ష్మీ రాజు, ఉప సర్పంచ్ కమ్మరి స్వప్న లక్ష్మీ నారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగొని లక్ష్మి రాజ గౌడ్, గ్రామ పాలకవర్గ సభ్యులు వడ్ల చంద్ర కాంత్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గట్టగోని రామ గౌడ్, కృష్ణాజీగారి ఆనంద్ రావు, కమ్మరి సిద్ధ రాములు, బత్తుల కిషన్, అన్మల గంగయ్య, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం కావాలి - ప్రతి ఇల్లు నాణ్యతకు, భద్రతకు ప్రతీకగా నిలవాలి.
#డైలీభారత్ #Kamareddy #IndirammaIllu #DailyBharath