డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి యశోద హాస్పిటల్ బ్రాంచ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బోన్ మార్రో ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్, క్లినికల్ డైరెక్టర్ Dr. గణేష్ జైషేత్వర్ మాట్లాడుతూ రక్త క్యాన్సర్ పై కీలక విషయాలు వెల్లడించారు.
బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, ఇమ్యునోథెరపీ, CAR-T చికిత్సలతో వైద్యరంగంలో ముందడుగు పడిందని ఆయన తెలిపారు.
రక్త క్యాన్సర్ (బ్లడ్ క్యాన్సర్) అంటే ఇక మరణశిక్షగా భావించాల్సిన అవసరం లేదని, ఆధునిక వైద్య విధానాలతో ఈ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశాలు పెరిగాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, CAR-T సెల్ థెరపీ వంటి అత్యాధునిక చికిత్సలు రక్త క్యాన్సర్ బాధితులకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయి.
గతంలో రక్త క్యాన్సర్ చికిత్సలో అనేక సవాళ్లు ఉండేవని, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సలతో రోగులకు మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. ముఖ్యంగా లుకేమియా (ALL, AML) వంటి రక్త క్యాన్సర్ల చికిత్సలో CAR-T సెల్ థెరపీ కీలక మార్పులు తీసుకొస్తోందని తెలిపారు.
హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌లో ఆధునిక వైద్య సదుపాయాలతో రక్త క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, ఇమ్యునోథెరపీ, CAR-T చికిత్సల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. రక్త క్యాన్సర్ లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించి సరైన సమయంలో వైద్యులను సంప్రదిస్తే చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
రక్త క్యాన్సర్‌కు సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు:
- కారణం తెలియని జ్వరం
- అకారణంగా బరువు తగ్గడం
- శరీరంలో రక్తస్రావం కావడం
- తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం
- మెడ, చంకలు లేదా ఇతర ప్రాంతాల్లో శోషరస గ్రంథులు (Lymph Nodes) వాపు
- తీవ్రమైన రక్తహీనత (Anemia)
- రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం
ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాదు. అయితే నిరంతరంగా ఇలాంటి సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆధునిక వైద్య చికిత్సలపై అవగాహన పెంచుకోవడం ద్వారా రోగులకు సకాలంలో వైద్యం అందించవచ్చని తెలిపారు.
#డైలీభారత్ #కామారెడ్డి #యశోదహాస్పిటల్ #BloodCancer #DailyBharath #Kamareddy