డైలీ భారత్, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన మధుకర్‌కు ప్రతిష్ఠాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), రాయ్‌పూర్ నుంచి డాక్టరేట్ లభించింది. వీర్నపల్లి మండలం, వన్‌పల్లి గ్రామానికి చెందిన మధుకర్ తల్లి తండ్రులు ప్రస్తుతం సిరిసిల్ల లో స్థిరపడింది. ఛత్తీస్‌గఢ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), రాయ్‌పూర్ లో నిర్వహించిన 17వ స్నాతకోత్సవంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు. “ఇంటర్నెట్ ఆఫ్ వెహికిల్స్ (IoV) కోసం కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత బ్లాక్‌చెయిన్ సాంకేతికతతో కూడిన డేటా భద్రతా ఫ్రేమ్‌వర్క్ రూపకల్పన మరియు అభివృద్ధి” పరిశోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బ్లాక్‌చెయిన్ సాంకేతిక పరిజ్ఞానాలను సమన్వయం చేస్తూ, ఇంటర్నెట్ ఆఫ్ వెహికిల్స్ (IoV)లో సమాచార భద్రతను మరింత పటిష్టం చేసే వినూత్న ఫ్రేమ్‌వర్క్‌ను మధుకర్ రూపొందించి అభివృద్ధి చేశాడు. ఆధునిక వాహన సాంకేతికతలో డేటా భద్రతకు సంబంధించిన సమస్యలకు ఈ పరిశోధన ఉపయోగకరమైన పరిష్కారాలను అందిస్తుంది. మారుమూల గ్రామమైన వన్‌పల్లి కి చెందిన తమ కుమారుడు మధుకర్ ఎన్‌ఐటీ రాయ్‌పూర్‌లో డాక్టరేట్ సాధించే స్థాయికి చేరుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని తల్లిదండ్రులు మల్లేశం, మంగమ్మ, భార్య నవ్యలు, వన్‌పల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. తాను పి హెచ్ డి సాధించడానికి కావేరి యూనివర్సిటీ ప్రొఫెసర్ మరియు డీన్ డా. కొండ శ్రీనివాస్, తల్లిదండ్రులు, భార్య ప్రోత్సాహం, సహకారం ఎంతో దోహదపడ్డాయని మధుకర్ తెలిపారు.
News
గుండా మధుకర్‌కు పీహెచ్‌డీ పట్టా ప్రదానం