| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీసీ-డీ నుండి బీసీ-ఏ లోకి మార్చాలి - కులగణన చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన ముదిరాజ్ మహాసభ

బీసీ-డీ నుండి బీసీ-ఏ లోకి మార్చాలి - కులగణన చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన ముదిరాజ్ మహాసభ

డైలీ భారత్, బీబీపేట్, కామారెడ్డి జిల్లా:  తెలంగాణ ముదిరాజ్ మహాసభ, బీబీపేట్ మండల ప్రధాన కార్యదర్శి కొరవి నరసింహులు బుధవారం రోజున ప్రెస్ నోట్ విడుదల చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

బీసీ-డీ నుండి బీసీ-ఏ లోకి మార్చాలని, ప్రత్యేకంగా కులగణన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కొరవి నరసింహులు మాట్లాడుతూ:

"ప్రభుత్వం బీసీ-డీ నుండి బీసీ-ఏ లోకి మార్చాలి. మాట ఇచ్చి కావున మార్చిన తర్వాత కులగణన చేయాలి. బీసీలను మాటలతో ప్రభుత్వం మోసం చేయకూడదు. ప్రతి కులాన్ని కులగణన చేసి ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి.

సంఖ్యాపరంగా పదవులు గానీ, నామినేటెడ్ పోస్టులు గానీ, ఎమ్మెల్యే పోస్టు గానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు గానీ ప్రతి ఒక్కటి కులగణన చేసిన తర్వాత బీసీ-డీ నుండి ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా దృష్టి పెట్టి అందరికీ న్యాయం చేయాలి.

బీబీపేట్ మండలం నుండి పిలుపుమేరకు కులగణన కల్పించాలి. లేనిపక్షంలో బీసీలమంతా ఎవరికి క్లారిటీ లేకుండా పోయింది. ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసి వెంటనే నివేదిక ప్రకారం ప్రతి ఒక్కరికీ పనులు కూడా కల్పించాలి. ఎవరు ఏ కులంలో ఉన్నా వారికి పనుబాట్లు కూడా ఇవ్వాలి.

ఒకటి రెండు కాదు, బీసీ-డీ నుండి ఏ లో ఎన్నో బీసీ కులాలు ఉన్నందున అందులో కులగణన మళ్లీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కులగణన చేయండి, ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము."

#Mudiraj #Bibipet #Kamareddy #BCDToBCA #CasteCensus #Telangana #BCMahasabha

Previous వరద ముంపుకు గురైన నెమలిపేట గ్రామంలో పర్యటించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి
Next డబ్బు ఉన్నా దొరకని రక్తం... సకాలంలో అందించి మహిళ ప్రాణం కాపాడిన టీచర్!
ADVERTISEMENT