| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తుమ్మల వాగు ఉధృతి - ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశాలతో రంగంలోకి అధికార యంత్రాంగం!

తుమ్మల వాగు ఉధృతి - ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశాలతో రంగంలోకి అధికార యంత్రాంగం!

డైలీ భారత్, జూలూరుపాడు: బేతలపాడు - నర్సాపురం పొంగిపొర్లుతున్న తుమ్మల వాగు ప్రాంతాన్ని పరిశీలించిన జూలూరుపాడు మండల అధికారుల యంత్రాంగం

జూలూరుపాడు మండలంలో వాగులు, వంకలు పొంగుతున్న ప్రాంతాలను చరవాణి ద్వారా తెలుసుకున్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ భారీ వర్షం కురుస్తున్న మండలంలో ఉన్న చెరువులు, వాగులు, కుంటలు పరిశీలించాలని అధికార యంత్రాంగానికి తెలియపరిచారు.

దీంతో జూలూరుపాడు మండల బేతాళపాడు - నరసాపురం మధ్య తుమ్మలవాగు ముసర తుఫాన్ ప్రభావంతో పొంగిపొర్లి రాకపోకలు బంద్ అయిన ప్రాంతాన్ని పోలీస్ యంత్రాంగం, అధికారులు కలిసి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్, ఎస్సై జీనత్ కుమార్, పోలీస్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

#Julurupadu #Wyra #ThummalaVagu #MusarCyclone #HeavyRain #TelanganaRains #DailyBharat

Previous మీ డబ్బు - మీ క్లిక్ - మీ ఎంపిక! ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ - విద్యార్థులకు పోలీసుల హెచ్చరిక
Next పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి... మీ ఓటు కేవలం ఓటు కాదు, రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఆయుధం : కీర్తిరెడ్డి
ADVERTISEMENT