| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇరుముడితో శబరిమలకు సైకిల్ యాత్ర... 4వ సారి సాహస యాత్ర చేపట్టిన తగరపువలస గుడ్ల నరసింహారెడ్డి గురుస్వామి!

ఇరుముడితో శబరిమలకు సైకిల్ యాత్ర... 4వ సారి సాహస యాత్ర చేపట్టిన తగరపువలస గుడ్ల నరసింహారెడ్డి గురుస్వామి!

ఇరుముడితో శబరిమలకు సైకిల్ యాత్ర చేపట్టిన గుడ్ల నరసింహారెడ్డి గురుస్వామి

డైలీ భారత్, తగరపువలస: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం (ABABS) విశాఖపట్నం జిల్లా తగరపువలస మండల కార్యదర్శి గుడ్ల నరసింహారెడ్డి గురుస్వామి ఈరోజు తగరపువలస నుండి ఇరుముడితో శబరిమలకు సైకిల్ యాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా గుడ్ల నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇలా సైకిల్ యాత్ర ఇప్పటివరకు నాలుగు సార్లు శబరిమలకు సైకిల్ యాత్ర చేశానని తెలిపారు.

ఇలా ఇరుముడితో ఆ మణికంఠుడిని సైకిల్ యాత్ర చేసి దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతం అని అన్నారు. గతంలో సైకిల్ పై కాశీ యాత్ర కూడా చేశానని తెలిపారు.

గురుస్వామికి స్థానిక అయ్యప్ప భక్తులు, గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన యాత్ర విజయవంతం కావాలని, స్వామి అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని భక్తులు ప్రార్థించారు.

#Ayyappa #Sabarimala #CycleYatra #Tagarapuvalasa #Visakhapatnam #SwamiyeSaranamAyyappa #ABABS

Previous ముసుర తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించిన బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్
Next వరద ముంపుకు గురైన నెమలిపేట గ్రామంలో పర్యటించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి
ADVERTISEMENT