డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తోడు, రాత్రి వీచిన బలమైన ఈదురుగాలుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు గాలుల ధాటికి నేలకొరిగి, పొలాల్లో నీరు నిలిచిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కళ్లముందే దెబ్బతినడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇప్పటికే పెట్టుబడుల భారంతో సతమతమవుతున్న రైతులకు తుపాను రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రభుత్వo వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి, బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ ఉసికల రమేష్ ప్రభుత్వాన్ని కోరారు