| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి : భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా అవగాహన కార్యక్రమం

కామారెడ్డి : భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా అవగాహన కార్యక్రమం

డైలీ భారత్, కామారెడ్డి: భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని, జనజాతి గౌరవ దివస్ వేడుకల్లో భాగంగా కామారెడ్డి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జీవిత చరిత్ర, గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, సమాజానికి అందించిన సేవలు మరియు త్యాగాలను విద్యార్థులకు వివరించడం జరిగింది.

గిరిజన వీరుడు బిర్సా ముండా స్ఫూర్తిని నేటి తరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, గిరిజన సంస్కృతి, హక్కులు, విద్య ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి నవీన్ కుమార్, ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Previous హైదరాబాద్‌లో భారీ నకిలీ నోట్ల రాకెట్ గుట్టురట్టు... రూ.6.78 కోట్ల ఫేక్ కరెన్సీ సీజ్, నలుగురు అరెస్ట్
ADVERTISEMENT