| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైదరాబాద్‌లో భారీ నకిలీ నోట్ల రాకెట్ గుట్టురట్టు... రూ.6.78 కోట్ల ఫేక్ కరెన్సీ సీజ్, నలుగురు అరెస్ట్

హైదరాబాద్‌లో భారీ నకిలీ నోట్ల రాకెట్ గుట్టురట్టు... రూ.6.78 కోట్ల ఫేక్ కరెన్సీ సీజ్, నలుగురు అరెస్ట్

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ SOT పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రూ.6.78 కోట్ల ముఖ విలువ కలిగిన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

వాహన తనిఖీల్లో గుట్టురట్టు:

నవంబర్ 1వ తేదీన రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో జాతీయ రహదారిపై నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానాస్పద కారును ఆపి సోదాలు చేయగా, సుమారు రూ.8 లక్షల నకిలీ నోట్లు లభించాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు కుంట్లూరులోని అద్దె ఇంటిపై దాడి చేయగా, మరో రూ.6.70 కోట్ల విలువైన నకిలీ నోట్లతో పాటు కలర్ ప్రింటర్లు, స్కానర్లు, కరెన్సీ కటింగ్ మెషిన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల వివరాలు:

ఈ కేసులో మడుపోజు కర్ణాకర్ (A1), చిన్నోళ్ల మాణిక్య రెడ్డి (A2), చెరుకుపెల్లి రత్నాకర్ రెడ్డి (A3), కరణం అజయ్ కుమార్ (A4) లను అరెస్ట్ చేశారు. జల్లి వెంకటేష్, కుంజా బలరాజు, కంపసటి శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నకిలీ పోలీసులుగా మోసాలు:

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం, ఈ గ్యాంగ్ యూట్యూబ్ చూసి నకిలీ నోట్ల తయారీ నేర్చుకుంది. తక్కువ ధరకే కరెన్సీ మారుస్తామంటూ ఆశ చూపి, బాధితులు రాగానే నకిలీ నంబర్ ప్లేట్లు, ఫేక్ పోలీస్ ఐడీ కార్డులు, వాకీటాకీలు, డమ్మీ పిస్టల్‌తో తమను తాము పోలీస్ అధికారులుగా పరిచయం చేసుకుని అసలు డబ్బును దోచుకునేవారు.

ప్రస్తుతం ఈ రాకెట్‌పై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

Previous ట్రూ-అప్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి... బీజేపీ నేత జూటూరు కీర్తిరెడ్డి
Next కామారెడ్డి : భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా అవగాహన కార్యక్రమం
ADVERTISEMENT