| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మండలంలో పొంగుతున్న వాగులు వంకలను పరిశీలించిన జూలూరుపాడు అదనపు ఎస్సై మనిషా

మండలంలో పొంగుతున్న వాగులు వంకలను పరిశీలించిన జూలూరుపాడు అదనపు ఎస్సై మనిషా

డైలీ భారత్, జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్రంలో మురస తుఫాన్ ప్రభావంతో  భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో  జూలూరుపాడు మండలంలో పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి చిన్నపిల్లలు వర్షంలో తడవకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకూడదు, రహదారులపై, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని జూలూరుపాడు అదనపు ఎస్సై మనిషా తెలియజేసినారు ఇప్పటికే కురిసిన భారీ వర్షాల కారణంగా  పలుచోట్ల నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు , ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేస్తున్నాను ప్రజలందరూ అధికారుల సూచనలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని   ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను జూలూరుపాడు మండలంలో పలు బ్రిడ్జిల వద్ద టక్టర్లు మరియు బానేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలో ఎటువంటి సమస్య అయినా 100 కి డయల్ చేయండి లేదా జూలూరుపాడు ఎస్సై చరవాణి నెంబర్ 8712682042 మరియు జూలూరుపాడుపోలీస్ స్టేషన్ నెంబర్8712682042 కు కాల్ చేయండి అని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Previous ఘోర ప్రమాదం : పూజా దీపం వల్ల అంటుకున్న గ్యాస్ సిలిండర్... CCTV ఫుటేజ్ వైరల్!
Next మురసు తుపానుతో రైతులకు తీవ్ర నష్టం, నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి
ADVERTISEMENT