నెమలిపేటలో గ్రామంలో ప్రతి కుటుంబానికి ఇందిరమ్మా ఇల్లు ఇవ్వాలి
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం వరద ముంపుకు గురైన నెమలిపేట గ్రామంలో పర్యటించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఈ నెమలిపేట గ్రామ ప్రజలకు ఈ తిప్పలు తప్పడం లేదని వర్షాలు వచ్చినప్పుడు ఇళ్లల్లోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని,ఈ గ్రామస్తులను ఓట్ల రూపంలో వాడుకుంటున్నారే తప్ప వాళ్ళ తిప్పలు పట్టించుకునే నాధుడు లేడని,ఇక్కడ నివసిస్తున్న అందరికీ ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని,నిత్యవసర వస్తువులు,శానిటేషన్ కి సంబంధించి పనులు,విద్యుత్ సౌకర్యం లాంటివి వెంటనే చూడాలని,ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం వెంటనే అందించాలని ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు మరి మేలుకొని ఈ గ్రామానికి సరైన పరిష్కారం ఏర్పాటు చేయాలని బిజెపి నాయకులు తంబల రవి డిమాండ్ చేశారు.