| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

డబ్బు ఉన్నా దొరకని రక్తం... సకాలంలో అందించి మహిళ ప్రాణం కాపాడిన టీచర్!

డబ్బు ఉన్నా దొరకని రక్తం... సకాలంలో అందించి మహిళ ప్రాణం కాపాడిన టీచర్!

సకాలంలో ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పర్ష వెంకటరమణ

రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో లక్ష్మి (32) అనే మహిళకు ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో, ప్రభుత్వ ఉపాధ్యాయులు పర్ష వెంకటరమణ సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులను నిర్వహిస్తూనే సామాజిక బాధ్యతగా పర్ష వెంకటరమణ, వారి కుమారులు మృణాల్, తృషాల్ ప్రతి సంవత్సరం మూడు నుండి నాలుగు సార్లు రక్తదానం చేయడమే కాకుండా డెంగ్యూ బాధితులకు, క్యాన్సర్ బాధితులకు ప్లేట్ లెట్స్ అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.

ఎన్ని డబ్బులు ఉన్నా సకాలంలో రక్తాన్ని ఇచ్చేవారు లేకపోతే ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి రక్తదానానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

తలసేమియా వ్యాధి చిన్నారుల కోసం మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తాం - డాక్టర్ బాలు

తలసేమియా బాధిత చిన్నారుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం మూడు నుండి నాలుగు సార్లు రక్తదానం చేసే రక్తదాతలకు అభినందన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రక్తదాతలను అభినందించాల్సిన బాధ్యత నేటి సమాజం పై ఉందని అన్నారు. రక్తదాతకు కృతజ్ఞతలను తెలియజేశారు.

#Kamareddy #BloodDonation #ParshaVenkataRamana #IVFSevaDal #Thalassemia #DonateBloodSaveLife #DailyBharat #TelanganaNews

Previous బీసీ-డీ నుండి బీసీ-ఏ లోకి మార్చాలి - కులగణన చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన ముదిరాజ్ మహాసభ
Next మీ డబ్బు - మీ క్లిక్ - మీ ఎంపిక! ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ - విద్యార్థులకు పోలీసుల హెచ్చరిక
ADVERTISEMENT