డైలీ భారత్, కామారెడ్డి: సైబర్ జాగరూకత దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా డీ4సీ ఆధ్వర్యంలో సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వీరయ్య, డీ4సీ ఎస్‌ఐ నరేష్ నేతృత్వంలో సదాశివనగర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయులు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
“మీ డబ్బు – మీ క్లిక్ – మీ ఎంపిక” అనే నినాదంతో ఆన్‌లైన్ ప్రకటనల మోసాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాల చోరీ, షేర్ల మార్కెట్, పెట్టుబడుల పేరుతో జరిగే మోసాల గురించి వివరించారు.
తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సందేశాలు, కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని అవగాహన కల్పించారు.
సైబర్ ఆర్థిక మోసానికి గురైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సదాశివనగర్ సీఐ వీరయ్య, డీ4సీ ఎస్‌ఐ నరేష్, పోలీసు సిబ్బంది ప్రవీణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహనే తొలి రక్షణ.. అప్రమత్తతతోనే మన డబ్బుకు, వ్యక్తిగత సమాచారానికి భద్రత.
#Kamareddy #CyberCrime #CyberAwareness #Sadashivnagar #D4C #ModelSchool #1930Helpline #DailyBharat