డైలీ భారత్, హైదరాబాద్: పట్టభద్రుల ఓటు కేవలం ఓటు మాత్రమే కాదు.. రేపటి మన రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తివంతమైన ఆయుధమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జూటూరు కీర్తిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీమ్ తో కలిసి పలు ఆఫీసులలో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్స్ ను కలుస్తూ ఓటు నమోదు చేయించారు.
ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ.. ఈ దేశ భవిష్యత్తు విద్యావంతులు, యువత చేతుల్లోనే ఉందనీ, అది మారాలన్నా, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే సమగ్ర చట్టాలు రూపొందించాలన్నా, మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో విద్యావంతులు, మేధావుల పాత్ర అవసరమన్నారు. శాసనమండలి వంటి ఎగువ సభలో ప్రజా సమస్యలకు, ముఖ్యంగా విద్యావంతులు, పట్టభద్రుల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత లభించాలన్నారు.
అది సాధ్యమవ్వాలంటే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ముఖ్యాంశాలు:
ప్రజాస్వామ్యంలో విద్యావంతులు, మేధావుల భాగస్వామ్యం కీలకం
త్వరలో రాష్ట్రంలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
డిగ్రీ లేదా ఆపై విద్య పూర్తి చేసిన పట్టభద్రులందరూ తప్పక తమ ఓటు నమోదు చేసుకోవాలి
#GraduateMLC #JuturuKeerthiReddy #BJP #Hyderabad #JubileeHills #VoterEnrollment